ఇటీవల టీవీ నటి ఇషా నేగీతో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ దానికి అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘ నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా. ఎందుకంటే నా సంతోషానికి నువ్వే కారణం’ అని క్యాప్షన్ జోడించాడు. మరి అలా ఎందుకు రాశాడో ఆ సమయంలోనే అందరికీ అర్థమైనప్పటికీ, తాజాగా దాన్ని నిజం చేస్తూ ఇషాను సంతోషంగా ఉంచే పనిలో ఉన్నాడు రిషభ్. ఇప్పుడు ఈ జంట విహార యాత్రల్లో మునిగి తేలుతోంది. క్రిస్ట్మస్, న్యూఇయర్ వేడుకల్లో భాగంగా రిషభ్-ఇషాల జోడి ప్రేమాయణం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని గర్ల్‌ఫ్రెండ్ ఇషాతో గడపడానికి కేటాయించాడు పంత్.


0 Comments