ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కొత్త ఏడాది రోజున ఇరాన్ మద్దతుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఏకంగా రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఈ దాడిలో ఇరాన్, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతిచెందారు. రాకెట్ దాడిలో ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసీం సులేమన్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయ కార్గో హాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.

0 Comments