ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ వెల్ఫేర్‌బోర్డును ఏర్పాటుచేసేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మరో ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించి గురువారం సర్క్యులర్ జారీచేసింది. ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేకుండా వేల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ కార్మికులకు సూచించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సూచనలో మేరకు ఆర్టీసీలో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను పేర్కొంటూ సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులు వారి సమస్యలను సులువుగా చెప్పుకొనేందుకు వీలుగా బోర్డు సభ్యులు అందుబాటులో ఉండనున్నారు.


0 Comments