Tech News

header ads

ప్రతీ థియేటర్లోనూ పండగే పండగ


ప్రతిరోజూ పండగే సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే 31 కోట్ల షేర్ వసూలు చేసి అటు మారుతి.. ఇటు సాయి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ దూకుడు కొనసాగుతూనే ఉంది. మరో సినిమా ఏదీ లేకపోవడం.. పోటీగా వచ్చిన ప్రతీ సినిమా డిజాస్టర్ కావడంతో ప్రతిరోజూ పండగే నిజంగానే పండగ చేసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా 14 రోజుల్లో ఇప్పటికే 32 కోట్లు షేర్ వసూలు చేసి.. 40 కోట్ల వైపు అడుగులేస్తుంది.

విడుదలైన 13వ రోజు ప్రతిరోజూ పండగే 2.91 కోట్ల షేర్ వసూలు చేసింది. అసలు మూడు రోజుల తర్వాత కలెక్షన్స్ చల్లబడిపోతున్న ఈ రోజుల్లో 13వ రోజు కూడా 2.91 కోట్ల షేర్ వసూలు చేసిందంటే దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 2 మాత్రమే విడుదలైన 13వ రోజు 4.98 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత మరే సినిమాకు ఇది సాధ్యం కాలేదు. బాహుబలి కూడా 13వ రోజు 3 కోట్ల కంటే తక్కువే షేర్ తీసుకొచ్చింది. కానీ సాయి మాత్రం ఇది చేసి చూపించాడు. మరో సినిమా ఏదీ లేకపోవడంతో దుమ్ము దులిపేస్తున్నాడు మెగా మేనల్లుడు. మొత్తానికి అరడజన్ ఫ్లాపుల తర్వాత అదిరిపోయేలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు సాయి.

Post a Comment

0 Comments