మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రభుత్వంలోనూ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన మంత్రులకు కీలక శాఖలను అప్పగించేందుకు శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. డిసెంబర్ 30న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే.
ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. కాగా శాఖల కేటాయింపు కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు పర్యావరణ, పర్యాటక శాఖ ఇస్తారని సమాచారం. సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ శాఖ కావాలని పట్టుబట్టినా శివసేన అంగీకరించలేదని తెలుస్తోంది


0 Comments