తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్నా చితక పాత్రల్లో నటించినా అంతగా గుర్తింపు రాని అనసూయ.. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో ఒక్కసారిగా అనసూయకు అవకాశాల మీద అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు ఈ చిత్రంలోని నటనకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారం కూడా అందుకుంది. కేవలం జబర్దస్త్ కామెడీ షో, లోకల్ గ్యాంగ్స్ వంటి కాకుండా.. అనసూయలో మరో యాంగిల్ ఉంది. తాజాగా ఈ జబర్ధస్త్ బ్యూటీ న్యూ ఇయర్ సందర్భంగా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఏదో అడివిలోకి వెళ్లి ఎంజాయ్ చేసారు. దానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను అనసూయ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మొత్తానికి న్యూ ఇయర్ ఈవెంట్‌లో ఎక్కడా పాల్గొనకుండా.. అనసూయ తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరాన్ని బాగానే ఎంజాయ్ చేసింది.


0 Comments