మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) డైరీ ఆవిష్కరణ కార్యకమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నటుడు మోహన్ బాబు మాట్లాడుతున్న సమయంలో.. చిరంజీవి ఆయన్ను ఆత్మీయంగా హత్తకుని,బుగ్గపై ముద్దు పెట్టారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీలు ఒకే వేదికపై కూర్చొని సరదాగా ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకునేవారని మోహన్ బాబు అన్నారు. అలాగే తానూ, చిరంజీవి కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకుంటుంటామని చెప్పారు. అదంతా సరదాకే తప్ప తమ మధ్య నిజంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు. మోహన్ బాబు మాటలకు ముగ్దుడైన చిరంజీవి ఆయన బుగ్గపై ముద్దు పెట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులంతా ఒకే తల్లి బిడ్డలని మోహన్ బాబు అన్నారు. రాష్ట్రంలో ఉన్న 10 కోట్ల మందిలో ఎంతోమంది అందగాళ్లు,ప్రతిభావంతులు ఉండగా.. ఇండస్ట్రీలో తమకే అవకాశం దక్కడం నిజంగా అదృష్టం అన్నారు. కుటుంబాల్లో చిన్న చిన్న తగాదాలు ఉన్నట్టే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయని, అంతే తప్ప తమదంతా ఒకే కుటుంబం అని స్పష్టం చేశారు


0 Comments